మట్టి గణపతి ప్రతిమల పంపిణి
NEWS Aug 27,2025 02:32 pm
గణపతి నవరాత్రుల సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు, మెట్‌పల్లి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల ప్రకారం పాత బస్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద 100 మట్టి గణపతులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అక్షయ్ కుమార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, టీఎంసీ ప్రతినిధులు సోమిడి శివ, ముజీబ్, ఎండి నిజాం, అశోక్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.