బండికి టీపీసీసీ చీఫ్ సవాల్
NEWS Aug 27,2025 07:46 am
కేంద్ర మంత్రి బండి సంజయ్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. 12 ఏళ్ల బీజేపీ పాలన, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై కరీంనగర్ నడి బొడ్డున చర్చకు సిద్ధమా అని అన్నారు. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తిరగడానికి నేను సిద్దంగా ఉన్నానని, మరి నీకు అంత ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎన్నిసార్లు ఓడిపోయావో గుర్తు లేదా అని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి బండి సంజయ్ సిద్దంగా ఉండాలన్నారు.