బలపడుతున్న అల్పపీడనం
NEWS Aug 27,2025 09:47 am
బంగాళా ఖతాంలో అల్ప పీడనం బలపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, ఏలూరు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం..విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్లలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.