స్వదేశీ పరిజ్ఞానంతో యుద్ద నౌకలు
NEWS Aug 27,2025 09:42 am
ఇక నుంచి నావికా దళంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారయ్యే యుద్ధ నౌకలే ఉంటాయన్నారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి ఆత్మనిర్బర్ భారత్ కు నిదర్శనం అన్నారు. 2050 నాటికి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 200 యుద్ధ నౌకల నిర్మాణం చేపడతామని ప్రకటించారు. యుద్ధ నౌకల నిర్మాణంలో ఇకపై విదేశాలపై ఆధారపడే ప్రసక్తి లేదన్నారు.