ఖైరతాబాద్ గణేశుడికి భారీ బందోబస్తు
NEWS Aug 27,2025 09:37 am
ఖైరతాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ గణేశుడి విగ్రహానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు డీసీపీ శిల్పావలి. ఇవాళ అర్థరాత్రి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రత్యేకమైన సీసీ కెమెరాలతో పాటు కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బడా గణేష్ వద్ద క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ ని ఉంచామన్నారు.వివిధ శాఖల సమన్వయంతో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా పూర్తి చేస్తామన్నారు.