ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
NEWS Aug 27,2025 09:29 am
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. ఆర్టీసీలో గత కొంత కాలంగా నిలిచి పోయిన ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు ఆమోదం తెలిపారు. అర్హులైన దాదాపు 3 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ ఉద్యోగులు, సూపర్‌వైజర్లకు ప్రమోషన్స్ రానున్నాయి. ఈ సందర్బంగా కూటమి సర్కార్ కు ధన్యావాదాలు తెలిపారు ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు.