చంద్ర గ్రహణం ఎఫెక్ట్ తిరుమల దర్శనానికి బ్రేక్
NEWS Aug 27,2025 09:24 am
చంద్ర గ్రహణం సందర్బంగా సెప్టెంబర్ 7 సా.3.30 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 3 గంటల వరకూ శ్రీవారి ఆలయం మూసి వేస్తున్నట్లు తెలిపారు ఈవో. 8వ తేదీన సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం చేస్తారని పేర్కొన్నారు. అనంతరం ఏకాంతంగా తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 6 గంటలకు భక్తులకు శ్రీవారి దర్శనం పునః ప్రారంభం అవుతుందన్నారు. చంద్రగ్రహణం సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.