కాలర్ ఎగరేసేలా చంద్రబాబు పాలన
NEWS Aug 26,2025 09:05 pm
రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎందరో నాయకులు తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారని, టీడీపీ రాజకీయ యూనివర్శిటీ అని మంత్రి ఎస్.సవిత అన్నారు. టీడీపీ కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. టీడీపీ కార్యకర్తల పార్టీ అని స్పష్టం చేశారు. పని చేసిన వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందని, ఇందుకు ఇటీవల భర్తీ చేసిన నామినేటెడ్ పదవులే నిదర్శమని అన్నారు.