విద్యార్థులకు 100 స్టీల్ ప్లేట్లు
NEWS Aug 26,2025 11:27 pm
ఇబ్రహీంపట్నం: వర్షకొండ గ్రామంలో మహిళా మండలం వీఓఎస్ లు ప్రహ్లాద లక్ష్మి, ఎస్కే అప్సర, ఎస్కే రుక్సానా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం 10 వేల రూపాయల విలువైన 100 స్టీల్ ప్లేట్లను అందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అచ్చా విజయ భాస్కర్ విద్యార్థుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ వర ప్రసాద్, ఎక్స్ ఎంపీటీసీ వెంకట్, వర్షకొండ మహిళా మండల సిసి రాజశ్రీ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.