విజయవాడ: డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో 72 అడుగుల ఎత్తైన కార్యసిద్ధి మహాగణపతి విగ్రహం ఆవిష్కరించారు. కూర్చున్న భంగిమలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద గణపతి విగ్రహమిది. 55 మంది కళాకారుల శ్రమతో 40 టన్నుల మట్టి, ఉక్కు, పర్యావరణ హిత పదార్థాలతో విగ్రహాన్ని రూపొందించారు. నిమజ్జనం కోసం ప్రత్యేక స్ప్రింక్లర్ విధానం అమలు చేయగా, నదులు కలుషితం కాకుండా చూసుకున్నారు. ప్రతిష్ఠాపన తర్వాత నిత్యం పూజా కార్యక్రమాలు, హోమాలు, అన్నదానం జరుగనున్నాయి.