మట్టి విగ్రహాలతో పర్యావరణాన్ని కాపాడదాం
NEWS Aug 26,2025 05:41 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు తోడ్పడినట్లవుతుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడడం మనందరి ధ్యేయంగా ఉండాలని పిలుపునిచ్చారు. వినాయక నవరాత్రులను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.