'మటన్ సూప్' మూవీ నుంచి హరా హరా శంకరా సాంగ్ లాంచ్ చేసిన తనికెళ్ల భరణి
NEWS Aug 26,2025 06:44 am
రామచంద్ర వట్టికూటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'మటన్ సూప్' మూవీ నుంచి హరా హరా శంకరా లిరికల్ సాంగ్ ను ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి లాంచ్ చేశారు. ప్రసాద్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర టీంను తనికెళ్ల భరణి అభినందించారు. చిత్ర నిర్మాతలు మల్లికా ర్జున, గోపాల్, అరుణ్ చందర్, రామకృష్ణ పాల్గొన్నారు. సెప్టెంబర్ లో సినిమాను విడుదల చేస్తామని డైరెక్టర్ రామచంద్ర వట్టికూటి తెలిపారు. మట్టి గణపతి ప్రతిమలను చిత్ర యూనిట్ తరుపున తనికెళ్ల భరణి పంపిణి చేశారు.