కుక్కల దాడిలో చిన్నారికి గాయాలు
NEWS Aug 26,2025 12:13 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటరావుపేట గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఘటన గ్రామస్థులను కలచివేసింది. వీధి కుక్కలు విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ చిన్నారి తీవ్ర గాయాలపాలయ్యాడు. చిన్నారి పడుతున్న బాధను చూసి పలువురు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. వీధి కుక్కల సమస్యను పట్టించుకోవడంలో అధికారులు, జంతు ప్రేమికులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.