సెప్టెంబర్ 15 లోపు రేషన్ కార్డులు పంపిణీ
NEWS Aug 26,2025 08:51 am
మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వచ్చే సెప్టెంబర్ 15 లోపు అర్హులైన గుర్తించిన 4.42 కోట్ల మందికి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. వీటిని ఏటీఎం కార్డు తరహా తయారు చేయడం జరిగిందన్నారు. రేషన్ కార్డులకు మేలు చేకూర్చేలా తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు.