కేటీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే
NEWS Aug 26,2025 08:11 am
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ మాజీ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మీడియా ముందుకు రాక పోతే నిద్ర పట్టడం లేదన్నారు. ఆయనను అందుకే ట్విట్టర్ టిల్లు అనే పేరు పెట్టారంటూ ఎద్దేవా చేశారు ఎంపీ. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని బీఆర్‌ఎస్, బీజేపీ చెప్పాలని డిమాడ్ చేశారు. రెండు పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించారు. రెండు నాల్కల ధోరణి మంచిది కాదన్నారు.