శ్రీశైలం ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత
NEWS Aug 26,2025 08:06 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది శ్రీశైలం జలాశయానికి. దీంతో 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,60,615 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2,50,230 క్యూసెక్కులకు చేరుకుంది. నీళ్లు సమృద్దిగా ఉండడంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి.