ఎరువుల కొరత లేదన్న అచ్చెన్న
NEWS Aug 26,2025 07:07 am
రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. ఈ ఏడాది ఖరీఫ్ కోసం 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేశామని వెల్లడించారు. ఎరువుల కొరత రాకుండా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. గోదావరి వరదలతో సమస్యలు తలెత్తినా, ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందన్నారు. ఆగస్టు నెలలో 1.65 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించగా, అందులో 0.75 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే రాష్ట్రానికి చేరాయన్నారు.