సెప్టెంబర్ 19 నుంచి అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్
NEWS Aug 26,2025 07:07 am
11వ అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ను విజయవాడ సి ‘ఏ’ కన్వెన్షన్‌లో సెప్టెంబర్ 19 నుండి 21 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది నారెడ్కో ఈ ప్రాపర్టీ ఎక్స్‌పోలో గృహ కొనుగోలుదారులు, స్ధిరాస్తి వ్యాపార రంగానికి చెందిన వారికి సంయిక్త వేదికగా నిలవనుంది. ఈ ఫెస్టివల్‌లో 60కి పైగా ఎగ్జిబిటర్స్ పాల్గొనబోతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు, ఇంటీరియర్స్, బిల్డింగ్ మెటీరియల్ బ్రాండ్లు, ఆర్కిటెక్ట్‌లు, కన్సల్టెంట్లు, బ్యాంకులు ఇతర అనుబంధ సేవల విభాగాలు పాల్గొంటాయి.