ఏపీ ప్రభుత్వం ఖుష్ కబర్
NEWS Aug 26,2025 06:48 am
ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేష్ ఉత్సవ పందిళ్ళకు ఉచిత విద్యుత్ అందించడానికి రూ.25 కోట్లు ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని లోకేష్ సీఎంకు వెళ్లడించారు. మంత్రి చేసిన వినతికి సీఎం స్పందించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.