రాష్ట్రస్థాయి యోగా పోటీలకు వెంపేట విద్యార్థులు
NEWS Aug 26,2025 10:42 am
జగిత్యాల: కోరుట్లలో జరిగిన జిల్లాస్థాయి యోగా పోటీలలో వెంపేట ZPHS విద్యార్థులు చుక్కబొట్ల హేమచంద్ర (ప్రథమ స్థానం), శ్రీరాముల కార్తికేయ (ద్వితీయ స్థానం) విజయం సాధించారు. వీరు ఆగస్టు 5-7 తేదీల్లో నిర్మల్‌లో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు నాగరాజకుమారి, ఉపాధ్యాయులు అభినందించారు.