“ఆన్‌లైన్ దరఖాస్తుతోనే వినాయక మండపాలు”
NEWS Aug 25,2025 07:11 pm
బయ్యారం: వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతులు పొందాలని సీఐ వెంకటేశ్వరరావు సూచించారు. పినపాక మండల పరిధిలోని బయ్యారం పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ, ఆన్‌లైన్ దరఖాస్తు కాపీని తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. మండపాలను ప్రధాన రహదారులపై వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయాలని, రహదారులను క్లియర్‌గా ఉంచాలని సూచించారు.