సీతంపేటలో సమస్యల పరిష్కారానికి చర్యలు
NEWS Aug 25,2025 07:13 pm
పినపాక: సీతంపేట గ్రామపంచాయతీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎంపీఓ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన గ్రామపంచాయతీలో ఆకస్మిక పర్యటన నిర్వహించి పరిస్థితులను పరిశీలించారు. దోమల నివారణ కోసం మలాదిన్ పిచికారీ, ఫాగింగ్ వంటి చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. గ్రామస్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి లోపం లేకుండా పటిష్ట చర్యలు కొనసాగుతాయని ఎంపీఓ భరోసా ఇచ్చారు.