చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సన్నాహాలు
NEWS Aug 25,2025 07:14 pm
పినపాక: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చెరువుల్లో చేపల పిల్లల పంపిణీకి జిల్లా యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించిందని జిల్లా మత్స్యశాఖ అధికారి ఇంతియాజ్ తెలిపారు. పినపాక మండలం టి.కొత్తగూడెం గ్రామంలో మత్స్యకారులతో సమావేశం నిర్వహించారు. 100 శాతం రాయితీతో చేపల పంపిణీ చేపట్టడం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి బలోపేతం కానుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి వనరుల్లో 5.32 కోట్ల చేప పిల్లలను విడిచే లక్ష్యాన్ని నిర్దేశించామని తెలిపారు. పినపాక ఎంపీఓ వెంకటేశ్వరరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.