కాంగ్రెస్ సమావేశంలో మహేందర్ రెడ్డి
NEWS Aug 25,2025 02:47 pm
గంగాధర మండలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి మాట్లాడారు. సమావేశ వేదికపై రాష్ట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.