కొద్ది సేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రానుండటంతో పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం పర్యటనకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు యూనివర్సిటీ వైపు వెళ్లే పలు రోడ్లను బ్లాక్ చేయడంతో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే సమయంలో, నిరసనలు వ్యక్తం చేసే అవకాశం ఉందన్న కారణంగా పలువురు విద్యార్థులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.