'నేరస్థులను కఠినంగా శిక్షించాలి'
NEWS Aug 25,2025 11:49 am
చర్ల–గొల్లగూడెం మార్గంలో జరిగిన ఆదివాసి బాలికపై సామూహిక అత్యాచార ఘటనను జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు తీవ్రంగా ఖండించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బాలికకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి దారుణానికి పాల్పడ్డారనే వార్త కలచివేసిందని ఆయన అన్నారు. ఈ ఘటనను ప్రభుత్వం సాధారణ కేసుగా కాకుండా తీసుకుని, నేరస్థులను కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చట్టపరమైన చర్యలు అవసరమని రేగా కాంతారావు డిమాండ్ చేశారు.