ఆర్థిక సహాయం కోరలేదు: రిషి వర్మ
NEWS Aug 25,2025 05:51 am
హైదరాబాద్‌లో జరుగుతున్న అండర్-15 వాలీబాల్ నేషనల్ మీట్‌కు తాను ఎంపికైన విషయాన్ని పినపాక మండల కేంద్రానికి చెందిన రిషి వర్మ తెలిపారు. అయితే, ఈ ప్రయాణానికి తాను ఎవరిని ఆర్థిక సహాయం అడగలేదని, దినపత్రికల్లో సహాయం కోరినట్లు ప్రచురించడం తప్పని ఆయన స్పష్టం చేశారు. సోమవారం పినపాకలో మాట్లాడిన రిషి వర్మ, క్రీడాకారులకు అవసరమైన ఖర్చులు ప్రభుత్వం తరఫున ఐటిడిఏ ద్వారా భరించబడతాయని తెలిపారు.