ఓట్ చోరీపై నిలదీయాలి
NEWS Aug 25,2025 10:50 am
ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఎంపీ రాహుల్ గాంధీ. ఢిల్లీలో మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన జిల్లా పార్టీ బాధ్యులతో జరిగిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ నిర్వాకం కారణంగా 65 లక్షల ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయారని ఆరోపించారు. అందుకే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు.