దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారు
NEWS Aug 25,2025 08:17 am
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దొంగ ఓట్లతోనే గెలిచాడని అన్నారు. ఆ పార్టీకి చెందిన మిగతా ఎనిమిది మంది ఎంపీలు కూడా అలానే గెలిచారన్న అనుమానం కలుగుతోందన్నారు. పని చేసి ఓట్లు అడగడం దమ్మున్న నాయకుడి లక్షణం అన్నారు. కానీ కులం పేరుతో, దేవుడి పేరుతో ఓట్లు అడిగే బిచ్చగాళ్లు బీజేపీ వాళ్లు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.