భద్రాద్రి కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం
NEWS Aug 25,2025 11:23 am
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఈ రోజు (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆయన సూచించారు.