ఎరువుల కొరత లేకుండా చూడాలి
NEWS Aug 25,2025 07:02 am
రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని వారిని పసిగట్టాలన్నారు .జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు నిత్యం సమన్వయం చేసుకుంటూ పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే కేసులు నమోదు చేయడానికి ఎక్కడా వెనుకాడొద్దని స్పష్టం చేశారు. ధరలు పెంచి ఎరువుల అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.