జగిత్యాల: వృద్ధుల్లో మనోధైర్యం నింపేందుకు అవగాహన సదస్సులు
NEWS Aug 25,2025 11:19 am
జగిత్యాల: వృద్ధుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వారి సమస్యలకు పరిష్కార మార్గాలు చూపేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో “వృద్ధుల ఆత్మహత్యల నివారణ–పిల్లల బాధ్యత”, “ప్రభుత్వ చట్టాలు, వృద్ధుల సంరక్షణ చట్టం” వంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు.