'జిల్లాలో యూరియా కొరత లేనేలేదు'
NEWS Aug 25,2025 11:17 am
జగిత్యాల జిల్లాలో శుక్రవారం వరకు 5,53,890 బస్తాల యూరియాను రైతులకు పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి భాస్కర్ తెలిపారు. ప్రస్తుతం 3,703 బస్తాల యూరియా నిల్వ ఉందన్నారు. యూరియా పంపిణీ విషయంలో కొందరు కావాలనే కొరత ఉందని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరిపడా యూరియా అన్ని మండలాల్లో అందుబాటులో ఉందిని పేర్కొన్నారు.