కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల ధర్నా
NEWS Aug 24,2025 11:59 pm
జగిత్యాల: జిల్లాలో అంగన్వాడీ టీచర్ల, ఆయాల సాంకేతిక, స్థానిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, AITUC ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు 2 గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర అధ్య క్షురాలు సాయిశ్వరి, గౌరవ అధ్యక్షులు టేకుమల్ల సమ్మయ్య పాల్గొన్నారు.