సీఎం సహాయ నిధికి మెగాస్టార్ విరాళం
NEWS Aug 24,2025 09:01 pm
ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మెగాస్టార్ చిరంజీవి విరాళం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం విరాళానికి సంబంధించిన డీడిని అందజేశారు. మానవతా దృక్పథంతో భారీ విరాళాన్ని అందజేసిన మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపారు సీఎం. చిరంజీవిని స్పూర్తిగా తీసుకుని సినీ రంగానికి చెందిన నటీ నటులు, నిర్మాతలు తమ వంతుగా సాయం చేయాలని కోరారు.