వైసీపీని లేకుండా చేయాలని బాబు కుట్ర
NEWS Aug 24,2025 08:45 pm
ప్రతిపక్షాన్ని నామ రూపాలు లేకుండా చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేశారని, ఇచ్చిన ఏ హామీని పూర్తిగా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడి పోయిందని, అవినీతి రాజ్యం ఏలుతోందన్నారు.