ప్లేయర్లకు కలర్ బెల్టులు, సర్టిఫికెట్లు
NEWS Aug 24,2025 10:55 pm
మాస్టర్ తైక్వాండో క్లబ్, మెట్‌పల్లి అకాడమీ ఆధ్వర్యంలో తైక్వాండో కలర్ బెల్ట్ అప్‌గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షల్లో దాదాపు 40 మంది తైక్వాండో ప్లేయర్లు పాల్గొని ప్రతిభ కనబరిచారు. వారి ప్రదర్శన ఆధారంగా వారికి తగిన కలర్ బెల్టులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధాన ఎగ్జామినర్‌గా తెలంగాణ రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ ట్రెజరర్, జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మాస్టర్ గందే సంతోష్‌కుమార్ హాజరై ప్లేయర్లను పరీక్షించి, బెల్టులు మరియు సర్టిఫికెట్లు అందజేశారు. క్లబ్ వ్యవస్థాపకులు, నేషనల్ కోచ్, నేషనల్ రిఫరీ తైక్వాండో క్రీడ ద్వారా శారీరక, మానసిక వికాసం సాధ్యమని పేర్కొన్నారు.