కాలువ తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు
NEWS Aug 24,2025 10:58 pm
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాలువ తండాలో తీజ్ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఏటా 9 రోజుల పాటు శ్రీ జగదాంబ దేవి ఆలయంలో గోధుమలు చల్లి, ఉదయం-సాయంత్రం నీళ్లు పోస్తూ పెళ్లి కాని మహిళలు పవిత్రంగా జరుపుకునే ఈ పండుగను ఈసారి కూడా భక్తి శ్రద్ధలతో జరిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా కాలువ తండా జగదాంబ ఆలయం నుంచి డీజేలతో, ఆటపాటలతో, కోలాటాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి చిట్యాల వాగులో నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో గ్రామ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దిలావర్పూర్ ఎస్సై రవీందర్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.