ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి
NEWS Aug 24,2025 10:56 pm
భద్రాద్రి: జిల్లాలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయ ఖాళీలను చూపించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. డీఈఓ కార్యాలయ సూపరింటెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రమోషన్ల ప్రక్రియలో పిల్లల సంఖ్య ప్రకారం అవసరమైన పాఠశాలల్లో ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కార్యదర్శి బి. రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఎం. రాజయ్య, కోశాధికారి ఎస్. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్. కృష్ణ, క్రీడా కమిటీ కన్వీనర్ మంజీలాల్, సీనియర్ సభ్యులు టి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.