ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు వార్నింగ్
NEWS Aug 24,2025 01:45 pm
సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు గాడి తప్పుతున్నారని, గీత దాటితే వేటు తప్పదన్నారు. పార్టీ రూల్స్ కు విరుద్దంగా ఎవరు వ్యవహరించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. శ్రీశైలం, అనంతపురం ఎమ్మెల్యేల వ్యవహారం శైలి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం పై ఆరా తీశారు. ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా.. ఇక మారకుంటే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. సమన్వయ కర్తలు, ఇన్‌ఛార్జి మంత్రులు ఎమ్మెల్యేలకు అర్థమయ్యేలా చెప్పాలని దిశా నిర్దేశం చేశారు.