రేపటి నుంచే కొత్త రేషన్ కార్డుల పంపిణీ
NEWS Aug 24,2025 01:37 pm
ఈనెల 25 నుంచే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలులో లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. పెద్దఎత్తున దివ్యాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ విషయంలో అర్హులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. క్యూ ఆర్ కోడ్ తో ఏటీఎం కార్డు లాగా ఈసారి రేషన్ కార్డులను ఇస్తున్నామని చెప్పారు.