28న విశాఖలో జనసేన కీలక సమావేశం
NEWS Aug 24,2025 01:08 pm
విశాఖలో ఈనెల 28న జనసేన పార్టీ కీలక సమావేశం జరుగుతుందని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని వెల్లడించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం, ఇతర అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో 300 మంది జనసేన రాష్ట్ర కార్యవర్గం సభ్యులు పాల్గొంటారని పేర్కొన్నారు.