ఎమ్మెల్యే కూచుకుళ్ల మాస్ వార్నింగ్
NEWS Aug 24,2025 01:03 pm
ఇందిరమ్మ ఇండ్లు, కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో కొంతమంది లబ్ధిదారుల వద్ద డబ్బులు డిమాండ్ చేసి వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. లబ్ధిదారులకు వచ్చేది లక్ష రూపాయలు మాత్రమేనని, అందులో నుంచి రూ.20 వేలు దళారులకు ఇస్తే వాళ్లకు మిగిలేది ఏంటని ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేశారు. ఎవరైనా దళారులు డబ్బులు డిమాండ్ చేస్తే స్వయంగా తనకి తెలిపాలని కోరారు.