ప్రజా నాయకుడికి సీఎం నివాళి
NEWS Aug 24,2025 11:58 am
సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ నివాళులు అర్పించారు. సురవరం సుధాకర్ రెడ్డి మృతి బాధాకరం అన్నారు. సుధాకర్ రెడ్డిది రాజీపడని నిరాడంబర జీవితమని పేర్కొన్నారు. ఏ రోజూ అహంకారాన్ని తన దరిదాపుల్లోకి రానివ్వ లేదన్నారు. సుధాకర్ రెడ్డి చేసిన సూచన మేరకు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామని తెలిపారు.