సురవరం జీవితం చిరస్మరణీయం
NEWS Aug 24,2025 11:52 am
విద్యార్థి నాయకుడి నుండి అంచెలంచెలుగా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి ముందుకు వచ్చి మద్దతు తెలిపారని గుర్తు చేసుకున్నారు. ఆయన మృతితో తెలంగాణ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.