మూసీ కోసం రూ. 375 కోట్లు విడుదల
NEWS Aug 24,2025 08:15 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం రూ.375 కోట్లు విడుదల చేసింది. బడ్జెట్లో కేటాయించిన నిధుల నుంచి వీటిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మూసీ నదిని ప్రక్షాళన చేయడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రతిపక్షాలు అడ్డు చెప్పినా ఆగేది లేదంటూ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.