రాజకీయ లబ్ది కోసమే జస్టిస్ పై కామెంట్స్
NEWS Aug 24,2025 08:11 am
రాజకీయ లబ్ధి కోసమే జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై అమిత్‌షా కామెంట్ చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ మల్లురవి. సల్వాజుడుం పేరుతో ఒకే వర్గం కొట్టుకోవద్దు అని జస్టిస్ తీర్పు ఇచ్చారని అన్నారు. సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన తీర్పు ఆయన వ్యక్తిగతంగా ఇచ్చింది కాదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్‌గా చూడాలన్నారు. నక్సలైట్లను సపోర్ట్ చేశారనటం అబద్దమన్నారు. అభద్రతాభావంతో బీజేపీ ముఖ్య నేతలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.