అధికారిక లాంఛనాలతో సురవరంకు అంత్యక్రియలు
NEWS Aug 24,2025 07:57 am
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అధికారిక లాంఛనాలతో సీపీఐ అగ్ర నేత సురవరం సుధాకర్ రెడ్డికి అంత్యక్రియలు జరపాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 9 గంటలకు కేర్ హాస్పిటల్ నుంచి భౌతికకాయం తరలిస్తారు. 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల సందర్శనార్థం మఖ్దూం భవన్‌లో భౌతిక కాయం ఉంచుతారు. ఆయన మృత దేహానికి సీఎం నివాళులు అర్పిస్తారు.