జగిత్యాలలో నేడు కరెంట్ బంద్
NEWS Aug 24,2025 12:55 pm
జగిత్యాల పట్టణంలోని టౌన్ -1 సెక్షన్ పరిధిలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని జగిత్యాల DE కె.గంగారాం తెలియజేశారు. లైన్లలో మరమ్మతుల కారణంగా వెంకటాద్రి నగర్, నవదుర్గ నగర్, గోవిందపల్లి, భాగ్యనగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ నగర్, గణేష్ నగర్, కరీంనగర్ రోడ్, సాయిరాం నగర్ ప్రాంతాలలో విద్యుత్ ఉండదని అన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరారు