ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు: ఎస్పీ
NEWS Aug 23,2025 11:30 pm
జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 27 నుండి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన వేడుకలను ప్రజలు శాంతియుతంగా, ప్రణాళిక ప్రకారం, ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని పోలీస్ అధికారులను సూచించారు. డయల్ 100కు వచ్చే కాల్స్ ను ప్రత్యేక శ్రద్ధతో పరిగణించాలన్నారు.